
సినిమా టైటిల్ చెప్పండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును.. మీరు విన్నది నిజమే . సంజీవని ప్రొడక్షన్ బ్యానర్‌పై'ఐఎంవై' అనే టైటిల్ పేరుతో ఒక కొత్త సినిమాను కె. శంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ మెయిన్ టైటిల్ కోసం లక్ష రూపాయల కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ లక్ష రూపాయాలు మీ సొంతం కావాలంటే మీ మెదడుకు పదును పెట్టిండి. సినిమా పేరును చెప్పేయండి. ఇంతకీ ఆ గొప్ప అవకాశం ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం..
దర్శకుడు త్రినాథ్ కటారి స్వీయ దర్శకత్వంలో 'ఐఎంవై' అనే టైటిల్‌తో ఒక కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన 'ఓం గం గణపతయే నమహా' అనే భక్తి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకి ఆర్.పి. పట్నాయక్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ పాటతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు, ఈ ఆసక్తిని మరింత పెంచడానికి మేకర్స్ ఒక వినూత్నమైన కాంటెస్ట్‌ను ప్రారంభించారు. 'ఐఎంవై' అనే టైటిల్‌కు తెలుగులో పూర్తి పేరు కరెక్ట్‌గా చెప్పిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, అత్యంత సృజనాత్మకంగా ఉన్న టాప్-10 టైటిల్స్‌ను పంపిన వారికి సైతం రూ.5 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. మీరు కూడా ఈ లక్ష రూపాయలు గెలుచుకోవాలని అనుకుంటే, ఈనెల 9వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్‌కు వాట్సాప్ చేయాలని మూవీ మేకర్స్ చెప్పారు..
►ALSO READ | Daksha: మంచు వారి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్.. 'దక్ష'తో రఫ్పాడించిన మోహన్ బాబు, లక్ష్మీ
సంజీవని ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మరి, మీ తెలివికి పదునుపెట్టి ఆ లక్ష రూపాయలను సొంతం చేసుకుంటారా?