యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ–మెయిల్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టులు: 04 (ఓబీసీ 01, ఈడబ్ల్యూఎస్ 01, అన్ రిజర్వ్ డ్ 02) (గెస్ట్ ఫ్యాకల్టీ).
ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో ఈఎల్ఎల్/ ఈఎల్ టీ/ ఇంగ్లిషులో ఎంఏ, నెట్/ జేఆర్ఎఫ్ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్/ఇంగ్లిష్ లింగ్విస్టిక్స్ కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఈ– మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 26.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
