సెంట్రల్ బ్యాంక్‌లో 4 వేల 500 అప్రెంటీస్ జాబ్స్.. ట్రైనింగ్ సమయంలో వేతనం కూడా..

సెంట్రల్ బ్యాంక్‌లో 4 వేల 500 అప్రెంటీస్ జాబ్స్.. ట్రైనింగ్ సమయంలో వేతనం కూడా..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ల కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 26.

పోస్టులు: అప్రెంటీస్(4500)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ద్వారా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధితవర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం:  జూన్ 07.
అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600. ఇతర అభ్యర్థులకు రూ.800.
లాస్ట్ డేట్: జూన్ 23. 
స్టైఫండ్: 12 నెలల ట్రైనింగ్ పిరియడ్​లో నెలకు రూ.15000 చొప్పున చెల్లిస్తారు. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఎగ్జామ్ డేట్: జులై మొదటి వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది.

ఎగ్జామ్ సిలబస్:
రాత పరీక్ష: ఆన్​లైన్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ (15 మార్కులు), లాజికల్ రీజనింగ్ (15 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (15 మార్కులు), ఇంగ్లీష్​ లాంగ్వేజ్ (15 మార్కులు), బేసిక్ రిటెయిల్ ప్రొడక్ట్స్ (10 మార్కులు), బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ (10 మార్కులు), బేసిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్రొడక్ట్స్ (10 మార్కులు), బేసిక్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ (10 మార్కులు ) ప్రశ్నలు ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. 

స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష:
ఏ రాష్ట్రంలో అయితే పని చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోగలిగే సామర్థ్యంపై పరీక్ష నిర్వహిస్తారు. 
 పూర్తి వివరాలకు centralbankofindia.co.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.