ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(నర్సింగ్) పూర్తి చేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టులు: 02 (ఎస్సీ 01, ఓబీసీ 01).
ఎలిజిబిలిటీ: ఇంటర్మీడియట్/10+2 లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో మూడేళ్ల కోర్సుతోపాటు నర్సింగ్ కౌన్సిల్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా బి.ఎస్సీ (నర్సింగ్) ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: డిసెంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
