గుజరాత్‌‌లో ఐఎస్ సభ్యులు అరెస్ట్‌‌

గుజరాత్‌‌లో ఐఎస్ సభ్యులు అరెస్ట్‌‌
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్ట్‌‌ స్క్వాడ్ సిబ్బంది

గాంధీనగర్‌‌‌‌ (గుజరాత్‌‌): ఇస్లామిక్ స్టేట్‌‌ (ఐఎస్‌‌) టెర్రరిస్ట్ సంస్థలో చేరేందుకు వెళ్తున్న నలుగురిని గుజరాత్‌‌లోని పోర్‌‌‌‌బందర్‌‌‌‌లో యాంటీ టెర్రరిస్ట్‌‌ స్క్వాడ్ (ఏటీఎస్‌‌) అధికారులు అరెస్ట్‌‌ చేశారు. వీరిలో ముగ్గురు యువకులు శ్రీనగర్‌‌‌‌కు చెందినవారు కాగా, మరో మహిళ సూరత్‌‌కు చెందినదిగా తెలిపారు. ఈ నలుగురు అఫ్గానిస్తాన్‌‌కు వెళ్లి ఐఎస్‌‌లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం అందడంతో, వారిపై భద్రతా సిబ్బంది నిఘా పెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి పోర్‌‌‌‌బందర్‌‌‌‌లో ప్రత్యేక ఆపరేషన్‌‌ చేపట్టి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఐఎస్‌‌ శిక్షణ కోసం అఫ్గానిస్తాన్‌‌కు పారిపోయి, ఆ తర్వాత ఐఎస్‌‌ అనుబంధ సంస్థ ఇస్లామిక్‌‌ స్టేట్‌‌ ఆఫ్‌‌ ఖొరాసన్‌‌ (ఐఎస్‌‌కేపీ)లో చేరాలని ప్లాన్‌‌ చేశారని పోలీసులు తెలిపారు.

పోర్‌‌‌‌బందర్‌‌‌‌ నుంచి అఫ్గానిస్తాన్‌‌కు వెళ్లడానికి వారు ఓ పడవను కూడా రెంట్‌‌కు తీసుకోవాలని ప్లాన్‌‌ చేశారని వెల్లడించారు. వీరి నుంచి జిహాదీ సాహిత్యం, మొబైల్‌‌ ఫోన్లు, ఐఎస్‌‌కేపీ జెండాలు, అమీర్ ఉల్‌‌ మోమినీన్‌‌ (కమాండర్‌‌‌‌ ఆఫ్‌‌ ఫెయిత్‌‌ఫుల్‌‌ అండ్‌‌ లీడర్‌‌‌‌) ప్రసంగ వీడియోలు, ఆడియో క్లిప్‌‌లు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరూ పోర్‌‌‌‌బందర్‌‌‌‌లో కూలీలుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి నిరుటి నుంచి టెర్రరిస్ట్‌‌ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. జుబేర్‌‌‌‌ మహ్మద్‌‌ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్‌‌ను విజయవంతంగా చేపట్టినందుకు పోలీసులను గుజరాత్‌‌ హోం మంత్రి హర్ష్‌‌ సంఘవి అభినందించారు.