
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (IAF), భారత సరిహద్దు భద్రతా దళం (BSF).. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఈ రెండు వ్యవస్థల సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్కు చేరవేస్తున్న గుజరాత్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ అని, అతను హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాడని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్వాడ్ సీనియర్ అధికారి కె సిద్ధార్థ్ మీడియాకు తెలిపారు.
28 ఏళ్ల సహదేవ్ సింగ్ 2023లో అదితి భరద్వాజ్ అనే పాక్ ఏజెంట్తో వాట్సా్ప్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. IAF, BSF ప్రదేశాలను, నిర్మాణంలో ఉన్న కొత్త IAF, BSF ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆ పాక్ ఏజెంట్కు 2025లో వాట్సాప్ చేశాడు.
ALSO READ | 20 వేల మంది భారతీయులు మరణించారు: యూఎన్లో పాక్పై భారత్ ఫైర్
నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్వాడ్కు తెలిసింది. 2025 ఆరంభంలో సహదేవ్ తన ఆధార్ కార్డ్ ను ఫ్రూఫ్గా పెట్టి కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నాడని.. ఆ నంబర్ నుంచే బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ ఫొటోలను, వీడియోలను అదితి భరద్వాజ్కు షేర్ చేశాడని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారి తెలిపారు. ఈ సమాచారాన్ని చేరవేసినందుకు 40 వేల రూపాయల డబ్బు కూడా సహదేవ్ సింగ్ గోహిల్కు ముట్టినట్టు విచారణలో తేలింది.
ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న12 మంది గూఢచారులు రెండు వారాల వ్యవధిలో పోలీసులు దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి నలుగురు, యూపీ నుంచి ఇద్దరు మొత్తం 12 మంది పాకిస్తాన్ ఏజెంట్లను ఎస్టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఐఎస్ఐకు స్పైలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నార్త్ ఇండియాలోని కీలక సమాచారం అంతా పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు నిర్ధారించారు.