గుజరాత్‌ సిక్సర్‌.. 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌‌ చిత్తు

గుజరాత్‌ సిక్సర్‌.. 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌‌ చిత్తు
  • రాణించిన శంకర్‌‌, షమీ, లిటిల్‌‌
  • ఆరో విక్టరీతో టాప్​కు టైటాన్స్‌‌

కోల్‌‌‌‌కతా: డిఫెండింగ్‌‌  చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ ఐపీఎల్‌‌16లో జోరు కొనసాగిస్తోంది. హ్యాట్రిక్‌‌ సహా ఆరో విక్టరీతో టాప్‌‌ ప్లేస్‌‌కు వచ్చి ప్లేఆఫ్స్‌‌కు చేరువైంది.  తమ సొంతగడ్డపై కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ చేతిలో ఎదురైన ఓటమికి జీటీ ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్‌‌లో మహ్మద్‌‌ షమీ (3/33), జోష్‌‌ లిటిల్‌‌ (2/25).. బ్యాటింగ్‌‌లో విజయ్ శంకర్‌‌ (24 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 నాటౌట్‌‌) సత్తా చాటడంతో ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో  శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌‌లో జీటీ 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌‌ను చిత్తు చేసింది. తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన కేకేఆర్‌‌ 20 ఓవర్లలో  179/7 స్కోరు చేసింది. ఓపెనర్‌‌ రహ్మనుల్లా గుర్బాజ్‌‌ (39 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81) అద్భుత ఇన్నింగ్స్‌‌తో  ఒంటరి పోరాటం చేశాడు.

షమీ దెబ్బకు మరో ఓపెనర్ జగదీశన్‌‌ (19), వన్‌‌ డౌన్‌‌లో వచ్చిన శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (0) పవర్‌‌ప్లేలో వెనుదిరగ్గా.. హిట్టర్‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (11), కెప్టెన్‌‌ నితీష్‌‌ రాణా (4) ఫెయిలయ్యారు. ఈ ఇద్దరూ జోష్‌‌ లిటిల్‌‌కు వికెట్లు ఇచ్చుకున్నారు. చివర్లో ఆండ్రీ రస్సెల్‌‌ (19 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34)తో పాటు రింకూ సింగ్‌‌ (19) పోరాటంతో కేకేఆర్‌‌ మంచి స్కోరే చేసింది. ఛేజింగ్‌‌లో చెలరేగి ఆడిన గుజరాత్‌‌ 17.5 ఓవర్లలో 180/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.

ఓపెనర్‌‌ సాహా (10) ఫెయిలైనా.. కెప్టెన్‌‌ హార్దిక్‌‌ (26)తో గిల్‌‌ (35 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 49) రెండో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జోడించి విజయానికి బాటలు వేశారు. వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔటైనా.. విజయ్‌‌ శంకర్, డేవిడ్‌‌ మిల్లర్‌‌ (18 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌‌) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వరుణ్‌‌ చక్రవర్తి వేసిన 17వ ఓవర్లో శంకర్‌‌ మూడు సిక్సర్లతో చెలరేగాడు. 24 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకొని టీమ్‌‌ను గెలిపించాడు. హర్షిత్‌‌, రసెల్‌‌, నరైన్‌‌ తలో వికెట్‌‌ తీశారు. జీటీ బౌలర్‌‌ జోష్‌‌ లిటిల్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది.