- గిల్.. దంచెన్
- ఢిల్లీపై గుజరాత్ గెలుపు
- ఫెర్గుసన్‌కు 4 వికెట్లు
పుణె: బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (46 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84), బౌలింగ్‌లో ఫెర్గుసన్ (4/28) రాణించడంతో గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్లో రెండో విక్టరీని నమోదు చేసింది. ఫలితంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 14 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. ఫస్ట్ ఓవర్లోనే వేడ్ (1)ను ఔట్ చేసి ముస్తాఫిజుర్ (3/23) ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. విజయ్ శంకర్ (13) ఉన్నంతసేపు గిల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో .. పవర్‌ప్లేలో గుజరాత్ 44/1 స్కోరు చేసింది. అయితే ఏడో ఓవర్లో విజయ్ను కుల్దీప్ (1/32) ఔట్ చేయడంతో సెకండ్ వికెట్‌కు 42 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఎదుర్కొన్న రెండో బాల్‌ను ఫోర్‌గా మలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31) ఢిల్లీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరి సమన్వయంతో ఢిల్లీ ఫస్ట్ టెన్‌లో 66/2 స్కోరుతో నిలిచింది. తర్వాత మరో రెండు ఫోర్లు బాదిన గిల్.. 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 14వ ఓవర్లో పాండ్యాను ఔట్ చేసి ఖలీల్ అహ్మద్ (2/34) ఝలక్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో గిల్ సిక్స్, మిల్లర్ (20 నాటౌట్) ఫోర్‌తో 11 రన్స్ సాధించారు. అక్షర్ వేసిన 16వ ఓవర్లో గిల్ రెండు భారీ సిక్సర్లతో జోరు పెంచినా.. 18వ ఓవర్లో ఖలీల్ దెబ్బకు వెనుదిరిగాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు 36 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రాహుల్ తెవాటియా (14), అభినవ మనోహర్ (1) భారీ హిట్టింగ్ చేయలేకపోయారు.
పంత్ పోరాడినా..
లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 157/9 స్కోరే చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (29 బాల్స్‌లో 7 ఫోర్లతో 43) టాప్ స్కోరర్. గుజరాత్ పేసర్ ఫెర్గుసన్ దెబ్బకు ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృథ్వీ షా (10), సీఫెర్ట్ (3).. ఢిల్లీకి శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో మన్దీప్ సింగ్ (18) కూడా నిరాశపర్చడంతో.. ఢిల్లీ ఓ దశలో 34/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్‌లో పంత్, లలిత్ యాదవ్ (25) ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 61 రన్స్ జోడించారు. అయితే 14వ ఓవర్లో పంత్ ఔట్‌కావడంతో ఢిల్లీ పరుగుల వేటలో వెనుకబడిపోయింది. రోవ్‌మెన్ పావెల్ (20), కుల్దీప్ యాదవ్ (14 నాటౌట్) ఫర్వాలేదనిపించినా.. అక్షర్ పటేల్ (8), శార్దూల్ ఠాకూర్ (2), ఖలీల్ అహ్మద్ (0), ముస్తాఫిజుర్ (3 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.