‌ విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌కు చెక్‌‌.. టాప్​ ప్లేస్‌‌లోకి గుకేశ్‌‌

‌ విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌కు చెక్‌‌..  టాప్​ ప్లేస్‌‌లోకి గుకేశ్‌‌

చెన్నై: ఇండియా యంగ్‌‌ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ డి. గుకేశ్‌‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియా చెస్‌‌లో 37 ఏళ్ల నుంచి నంబర్‌‌వన్‌‌గా కొనసాగుతున్న లెజెండ్‌‌ ప్లేయర్‌‌ విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌కు చెక్‌‌ పెట్టాడు. శుక్రవారం ఫిడే విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో గుకేశ్‌‌ 2758 రేటింగ్‌‌ పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌‌లో నిలవగా, ఆనంద్‌‌ 2754 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌‌కు పరిమితమయ్యాడు. 

దీంతో ఇండియా తరఫున టాప్‌‌ ప్లేస్‌‌ గుకేశ్‌‌ సొంతమైంది. 1986 జులై 1 నుంచి ఆనంద్‌‌ ఇండియా తరఫున నంబర్‌‌వన్‌‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్లో అదరగొట్టిన ఆర్‌‌. ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంక్‌‌కు దూసుకొచ్చాడు. ఓవరాల్‌‌గా టాప్‌‌–30లో విదిత్‌‌ సంతోష్‌‌ (27), ఎరిగైసి అర్జున్‌‌ (29), పి. హరికృష్ణ (31) ఉన్నారు. ఇక చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌ నెగ్గిన ప్రజ్ఞానందను సెంట్రల్‌‌ స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌ అనురాగ్‌‌ ఠాకూర్‌‌ శుక్రవారం ఘనంగా సత్కరించారు. అతి పిన్న వయసులో ప్రజ్ఞానంద చాలా పరిణతితో ఆడుతున్నాడని, చాలా వేగంగా ఎత్తులు వేస్తున్నాడని ఠాకూర్‌‌ ప్రశంసించారు.