అమెరికా ఎకానమీపై తుపాకీ..

అమెరికా ఎకానమీపై తుపాకీ..

అమెరికాలో దాదాపు 90 శాతం మంది గన్నులు ఎప్పుడూ తమతో అట్టిపెట్టుకుంటారని అంచనా. దీన్ని ఆ దేశ చట్టాలు సమర్థిస్తున్నాయి. అయితే, తుపాకీని జనాలు సెల్ఫ్​ డిఫెన్స్​కి బదులు సెల్ఫ్​ రెస్పెక్ట్​గా ఫీలవుతున్నారు. ఈ కల్చర్​ వల్ల అగ్రరాజ్యానికి కొత్త చిక్కులు వస్తున్నాయి. జనం ప్రాణాల సంగతి ఎలా ఉన్నా​ ఎకానమీపైన నెగెటివ్​ ఎఫెక్ట్​ పడుతోంది. గన్​ వయొలెన్స్​ సంబంధిత ఇన్సిడెంట్ల కారణంగా యూఎస్​ ఏటా సుమారు 23 వేల కోట్ల డాలర్లు నష్టపోతోంది.

అమెరికాలో ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో, ఎవరి చేతిలో గన్​ పేలుతుందో, ఎంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పలేం. ఇండియాలో ఒక గన్​ కొనాలన్నా గన్​ లైసెన్స్​ తెచ్చుకోవాలన్నా చాలా తతంగం ఉంటుంది. కానీ, అమెరికాలో సెల్ఫ్​ డిఫెన్స్​కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాంతో అక్కడ గన్నులు ఓపెన్​ మార్కెట్​లో దొరుకుతాయి. దీంతో కేవలం 200 డాలర్లు (సుమారు రూ.14 వేలు) చేతిలో ఉంటే, ఎవరైనా గన్ను కొనుక్కుని తమతో తిప్పుకోవచ్చు. అయితే, అమెరికన్లు ప్రతీకారాలు తీర్చుకోవటానికి, లేదా ఆత్మహత్యలకు గన్నులు వాడేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే  ఇలాంటి కాల్పుల ఇన్సిడెంట్లు 40,331 జరగ్గా, 10,681 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అగ్ర రాజ్యంలో గన్​ కల్చర్​ ఈమధ్య హైరేంజ్​లో మిస్ ఫైర్​ అవుతోందని ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. ‘గన్​ వయొలెన్స్​ ఆర్కైవ్’ అనే నాన్​ ఫ్రాఫిట్​ ఆర్గనైజేషన్ చేసిన స్టడీలో ఈ చేదు నిజాలు బయటపడ్డాయి.  ఈ దాడుల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దఎత్తున పడుతున్నట్లు మరో రిపోర్ట్​​లో తేలింది.

ఏటా 23 వేల కోట్ల డాలర్ల నష్టం

బందూకుల హింస కారణంగా యూఎస్​ ఏటా సుమారు 23,000 కోట్ల డాలర్ల మేర నష్టపోతోంది. ఇది అమెరికా గ్రాస్​ డొమెస్టిక్ ప్రొడక్ట్​ (జీడీపీ)లో 1.4 శాతానికి సమానం. ‘గిఫర్డ్స్​ లా సెంటర్​ ఫర్​ ప్రివెంట్​ గన్​ వయొలెన్స్​’ అనే సంస్థతోపాటు ‘సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​’ ఇచ్చిన డేటాను బట్టి అనలిస్టులు ఈ విషయాలు చెప్పారు. గన్​ వయొలెన్స్​తో ఒక్కో రాష్ట్రం ఎంతగా​ ఎకానమీ లాసయ్యిందో స్పష్టం చేశారు. ఈ రిపోర్ట్​ను అమెరికా కాంగ్రెస్​లోని ప్రతిపక్ష డెమొక్రాట్లు పట్టిచూపుతున్నారు. గన్​ వయొలెన్స్​ వల్ల కోల్పోయిన రాబడి ఎకానమీ లాస్​కి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. కాల్పుల ఘటనలు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. ఆఫీసులు, స్కూళ్లు, ఎగ్జిబిషన్లు.. ఇలా ప్రతి చోటా జరుగుతున్నాయి. ఆయా సంస్థలు, ప్రభుత్వాలు చనిపోయినవారి కుటుంబాలకు కంపెన్సేషన్​ భారీగా చెల్లిస్తున్నాయి. దీనికోసం బడ్జెట్​ పెంచాల్సి వస్తోంది. ఇది తలకు మించిన భారంగా మారుతోంది. పోలీస్​ కేసుల బుకింగ్​,​ ఇన్వెస్టిగేషన్ ఫాలోఅప్​​, క్రిమినల్​ జస్టిస్, ​హెల్త్​ కేర్​ ట్రీట్మెంట్​తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

దిద్దుబాటు చర్యలు ప్రారంభం

గన్​ సేల్స్​ కట్టడికి ‘బ్యాక్​గ్రౌండ్​ చెక్​’లను సాధ్యమైనంత బలోపేతం చేయాలని అమెరికా సర్కారు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది. గన్​ షోలతోపాటు అన్ని గన్​ అడ్వర్టయిజ్​మెంట్లను, కమర్షియల్​ సేల్స్​ని అదుపుచేయాలని కోరుతూ ఇటీవల ఓ మెమో జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. తుపాకీ కొనటానికి వచ్చేవాళ్లకు క్రిమినల్​ రికార్డు ఉన్నట్లుగా తనిఖీల్లో దొరికితే వెంటనే ఎన్​ఫోర్స్​మెంట్​ అఫీషియల్స్​కి అప్పగించాలని ట్రంప్​ ప్రభుత్వం ఆదేశించింది. దేశానికి చెడ్డ పేరు తెస్తున్న ఈ కాల్పుల సంస్కృతికి ఫుల్​ స్టాప్​ పెట్టడానికి ఇంకా ఏమేం చర్యలు తీసుకోవాలనే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంపై సోషల్​ యాక్టివిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రూరల్​ స్టేట్స్​లో ఎక్కువ

మిస్సిసిపి, అలబామా సహా కొన్ని గ్రామీణ రాష్ట్రాలు ఈ గన్​ కల్చర్​వల్ల కోలుకోనంత దెబ్బ తింటున్నాయి. బాధితులకు చెల్లిస్తున్న నిధులు ఆయా రాష్ట్రాల ఎకానమీలో మేజర్​ షేర్​ను ఆక్రమిస్తున్నాయి. గన్​ ఓనర్​షిప్​ రేట్​ అధికంగా గల అలస్కా, ఆర్కన్సాస్​ వంటి రాష్ట్రాల్లో గన్​ సూసైడ్లూ ఎక్కువే. యూఎస్​లోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఓవరాల్​గా ‘హయ్యస్ట్​ గన్​ డెత్​ రేట్​ పర్​ కేపిటా’ నమోదైన రాష్ట్రంగా అలస్కాని రిపోర్ట్​ గుర్తించింది.

ఇతర అభివృద్ధి చెందిన దేశాల​తో పోల్చితే అమెరికాలో తుపాకీ కాల్పుల్లో గాయపడుతున్నవారిలో, చనిపోతున్నవారిలో పిల్లలు, యూత్​ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. గన్​ వయొలెన్స్​ అనేది ప్రపంచంలో అమెరికాలో తప్ప మరెక్కడా ఈ స్థాయిలో లేదని, బాధితులకు పరిహారం తదితర ఖర్చులు భరించలేని రీతిలో పెరిగిపోతున్నాయని న్యూయార్క్​ డెమొక్రాట్​ కరోలిన్​ మెలోనీ అన్నారు. ఇదో తీరని విషాదమని, పరిష్కారం దొరకని సంక్షోభమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.