బాసరలో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

బాసరలో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో కొద్దిరోజులుగా చేపట్టిన గురుపౌర్ణమి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. తెల్లవారుజామున వేద వ్యాస మహర్షికి ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్ఛరణతో మహ అభిషేకం నిర్వహించి, పూజలు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా జిల్లా కలెక్టర్​అభిలాష అభినవ్​తోపాటు నిజామాబాద్​కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకుకొని పూజలు చేశారు. వేదవ్యాస మహర్షిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సైతం అమ్మ వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గోదావరి ఘాట్ లను పరిశీలించిన కలెక్టర్ 

బాసర ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలోని గోదావరి నది ఘాట్లను కలెక్టర్ అభిలాష పరిశీలించారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. పుణ్యస్నానాలకు నదీ తీరంలో లోపలికి వెళ్లకుండా బారికేడ్ల నిర్మాణాలపై రోడ్లు భవనాల శాఖ డీఈ సునీల్ కు పలు సూచనలు చేశారు. అంతకుముందు ట్రిపుల్​ఐటీలో వీసీ గోవర్ధన్​తో కలిసి రివ్యూ నిర్వహించారు. కలెక్టర్​వెంట వెంట ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ పవనచంద్ర, ఎస్సై శ్రీనివాస్, పలు శాఖల అధికారులు ఉన్నారు.