ఆర్ఎస్ ప్రవీణ్ బీజేపీ కోసం పనిచేస్తుండు : గువ్వల బాలరాజు

ఆర్ఎస్ ప్రవీణ్ బీజేపీ కోసం పనిచేస్తుండు : గువ్వల బాలరాజు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన యువత మధ్య మత చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల్లో దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వేరోస్ దేశాన్ని ఉద్దరిస్తుందనే భావనను విద్యార్థుల్లోకి తీసుకెళ్లారని విమర్శించారు. దోచిపెట్టిన డబ్బులతో స్వేరోస్ సంస్థలను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీజేపీ ఆశయం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ఎంత మందిని ఊచకోత కోసింది అందరికీ తెలుసని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భయబ్రాంతులకు గురిచేసినా బీజేపీపై తమ పోరాటం ఆగదని బాలరాజు స్పష్టం చేశారు.