నేను ఈరోజు బీఫ్ తిని పాకిస్తాన్ కు సపోర్ట్ చేయాలనుకుంటున్నా… అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ విద్యార్ధినిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ విషయం అస్సాంలోని గుహవాటి యునివర్సిటీలో జరిగింది. గుహవాటి కి చెందిన రెహనా సుల్తానా రెండు సంవత్సరాల క్రితం తన ఫేస్ బుక్ వాల్ పై పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసింది. అయితే ఆ పోస్ట్ కు సంబంధించిన ఫొటో… ప్రస్తుతం ఒక న్యూస్ వెబ్ సైట్ లో కనిపించడంతో రెహనా పై పోలీసులు కేసు పెట్టారు.
రెహనాను పోలీసులు ప్రశ్నించగా… తాను 2017లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ సున్నా పరుగులకే అవుట్ అవడం జీర్ణించుకోలేకపోయానని… అందుకే అలా పోస్ట్ పెట్టానని తెలిపింది. అయితే అలా పోస్ట్ చేయడం తప్పని తెలుసుకున్నానని ఆతర్వాత ఆ పోస్ట్ ను తీసేశానని పోలీసులకు సుల్తానా చెప్పింది. దీంతో పాటు… నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బిల్లును ఒక పద్యం తో విమర్శించింది సుల్తానా. ఇందుకు గాను ఆమెతో పాటు మరో తొమ్మిది మందిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.