
తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Praksh kumar) తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్తున్న ఒక చిన్నారి ప్రాణాలు కాపాడి.. ఆ కుంటుంబానికి దేవుడిగా నిలిచారు. అసలు విషయం ఏంటంటే.. చెన్నైకి ఒక వ్యక్తి తన సోషల్ మీడియాలో తన కోడలు ప్రాణాలు కాపాడాలంటూ పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆ చిన్నపాప ఆపరేషన్ కోసం సాయం చేయాలని కోరాడు.
ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. జీవీ ప్రకాశ్ కుమార్ స్పందించారు. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం అవసరమైన రూ. 75 వేల రూపాలను సాయంగా అందించారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది నా నుంచి చేస్తున్న చిరు సాయం అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ జీవీ ప్రకాష్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు గ్రేట్ బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ చేసిన సాయం తెలుసుకొని మరికొందరు ఆ పాపకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.