వాషింగ్టన్ : అమెరికాలో ఉన్న ఇండియన్స్ చాలా మందికి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులపై నిషేధం విధించటం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగా చాలా మంది హెచ్ 1 బీ వీసా హోల్డర్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా తమ వారి కోసం అక్కడే ఉండిపోతున్నారు. కరోనా ఎఫెక్ట్ తీవ్రం కావటంతో కేంద్రం గత నెలలో ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ను బంద్ పెట్టింది. వీసా లేకున్నా ఇండియాకు వచ్చే అవకాశం (ఓసీఐ) కార్డులు ఉన్న వారిని కూడా ఇండియాకు వచ్చేందుకు నో చెప్పింది. ఈ నిబంధనలే ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా మంది ఇండియన్స్ కు కష్టాలు తెచ్చిపెట్టాయి. హెచ్ 1 బీ వీసా, గ్రీన్ కార్డులపై వెళ్లిన అక్కడే సెటిలైన వారి పిల్లలు మాత్రం ఓసీఐ కిందకు వస్తారు. ప్రస్తుతం అమెరికా నుంచి చాలా మంది హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ ఇండియాకు వచ్చేందుకు రెడీ అయిపోయారు. కానీ వారి పిల్లలకు మాత్రం ఇండియాకు వచ్చేందుకు కేంద్రం పర్మిషన్ ఇవ్వటం లేదు. దీంతో ఇండియాకు వచ్చే చాన్స్ ఉన్న చాలా మంది పిల్లల కోసం అక్కడే ఉండాల్సి వస్తోంది. ఐతే హెచ్ 1 బీ వీసా ఉన్న వారు వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా 60 రోజుల్లో మళ్లీ జాబ్స్ సంపాందిచుకోకపోతే తిరిగి ఇండియాకు రావాల్సిందే. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో అమెరికాలోనే దాదాపు మూడున్నర కోట్ల మంది జాబ్స్ కోల్పోయారు. కొత్తగా ఇండియన్స్ జాబ్స్ రావటం కష్టమైన పనే. అలాంటి వారంతా తమ పిల్లలను వదిలి ఎలా ఇండియాకు వెళ్లాలంటూ ఆవేదన చెందుతున్నారు. అహ్మదాబాద్ కు చెందిన మమతా అనే మహిళలో అమెరికాలో ఉంటున్నారు. ఆమె కుమారుడికి 3 నెలల వయసు అమెరికాలోనే పుట్టాడు. ఆ చిన్నారి ప్రయాణానికి అనుమతించలేదు. దీంతో మమతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ఇండియన్స్ దంపతులకు కూడా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో ఇదే అనుభవం ఎదురైంది. ఇండియాకు వచ్చేందుకు సిద్ధమై కుటుంబంతో ఎయిర్ పోర్ట్ రాగా అమెరికాలో పుట్టిన వారి పిల్లలను ప్రయాణానికి అనుమతించలేదు. చేసేదేమీ లేక వారు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఓసీఐ నిబంధనలను మార్చాలంటూ అమెరికాలోని ఇండియన్స్ కోరుతున్నారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లెటర్
ఈ సమస్యను తీర్చాలంటూ అమెరికాలోని ఇండియన్స్ కమ్యూనిటీ లీడర్ ప్రేమ్ భండారి కోరారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెటర్ రాశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ఓసీఐ లు ఇండియాకు రాకుండా అడ్డుకోవటం సరికాదని లెటర్ లో పేర్కొన్నారు. దీని వల్ల అమెరికాలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఓసీఐ ట్రావెల్ పై ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని కోరారు.
