మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల జాకబ్ ఫిలడెల్ఫియాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా 2009లో అతనితో తీసుకున్న ఓ వీడియోను పంచుకున్నారు. అచ్చం తనలాగే ఒబామా జుట్టు కూడా ఉందంటూ జాకబ్ తన తలను నిమిరే సన్నివేశాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నపుడు ఓవల్ కార్యాలయాన్ని సందర్శించినపుడు ఇది జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ సంఘటన జరిగినపుడు జాకబ్ కు ఐదేళ్లున్నాయన్న ఒబామా... రీసెంట్ గా మళ్లీ దాదాపు 13ఏళ్ల తర్వాత అతన్ని కలుసుకున్నారు. ఈ ఫొటో తనకు చాలా ఫెవరేట్ అని కూడా తెలిపారు. గ్రాడ్యుయేషన్ సందర్భంగా జాకబ్ ను ఒబామా విష్ చేస్తూ అతనితో వర్చువల్ గా ముచ్చటించారు. ఒబామా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 1.4 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోగా, వేలల్లో కామెంట్స్, లైకులు వచ్చాయి.
Jacob Philadelphia was five years old when he visited the Oval Office and asked if his hair was like mine. That photo became one of our favorites – a reminder of the power of seeing yourself in your leaders.
— Barack Obama (@BarackObama) May 27, 2022
Today, he's graduating from high school! Check out our recent reunion. pic.twitter.com/gB39hFS3Wp
మరిన్ని వార్తల కోసం...
