హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ మార్కెట్ దూకుడు

హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ మార్కెట్ దూకుడు

న్యూఢిల్లీ: హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ మార్కెట్ సైజు 2032 నాటికి  560 మిలియన్లకు (దాదాపు రూ.4,661 కోట్లు) పెరుగుతుందని ఈ రంగంలోని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఇది గత సంవత్సరం 180 మిలియన్​ డాలర్ల నుంచి బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రముఖుల నుంచి హెయిర్ ​ట్రాన్స్​ప్లాంటేషన్​కు ఆదరణ పెరుగుతుందని అంటున్నారు.  గ్లోబల్ హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ మార్కెట్ భారీగా ఉందని,  వేగంగా అభివృద్ధి చెందుతోందని వరల్డ్ ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాక్షన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ సేథి చెప్పారు. 

 గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నడుపుతున్న సేథీ, తనకు అమెరికా లేదా యూరప్ నుంచి ఏటా 40 శాతం మంది కస్టమర్లు వస్తారని చెప్పారు. 2023–2032 మధ్య హెయిర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ మార్కెట్ సుమారు 12 శాతం సీఏజీఆర్​ వద్ద పెరిగే అవకాశం ఉందని కస్టమ్ మార్కెట్ ఇండెక్స్ చేసిన పరిశోధన వెల్లడించింది.  ప్రపంచవ్యాప్తంగా మెడికల్ టూరిజంలో  ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగమని పేర్కొంది.