స్టార్టప్​ల కోసం హైసియా ఇన్నోవేషన్​ సదస్సు

స్టార్టప్​ల కోసం హైసియా ఇన్నోవేషన్​ సదస్సు

హైదరాబాద్​, వెలుగు: హైసియా, హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​లు కలిసి కేటలిస్ట్ పేరుతో ఇన్నోవేషన్ కాన్​ఫ్లుయెన్స్​ను మంగళవారం నిర్వహించాయి. పెద్ద కంపెనీలతో స్టార్టప్​లు రిలేషన్​షిప్ బలపడేలా దీనిని డిజైన్​ చేసినట్లు హైసియా తెలిపింది. కార్పొరేట్​ లీడర్లు, స్టార్టప్​లను ఒకే వేదికపై తీసుకు రావడమే లక్ష్యమని పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ​ చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సెగ్మెంటని కాన్​ఫ్లుయెన్స్​లో పాల్గొన్న తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్​ రంజన్​ చెప్పారు. 

ఎస్​ఎఫ్​సీ,  టీ–వాలెట్, స్త్రీనిధి బ్యాంక్​ ​ వంటి ప్రభుత్వ ఆర్థిక సంస్థలతోనూ కలిసి పనిచేయాలని ఆయన స్టార్టప్​లకు సూచించారు. దేశంలో ఇన్నోవేషన్​ క్యాపిటల్​గా హైదరాబాద్​ రూపుదిద్దుకుంటోందని హైసియా ప్రెసిడెంట్​ మనీషా సాబూ పేర్కొన్నారు. ఫిన్​టెక్​ రంగంలో మరిన్ని స్టార్టప్​లు వచ్చేలా హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​ చొరవ తీసుకుంటున్నట్లు ఛైర్మన్​ జే ఏ చౌదరి చెప్పారు. నీడ్​ ఫర్​ ఇనొవేషన్​ ఇన్​ బ్యాంకింగ్​ అనే అంశంపై జేసీ పెన్నీ మేనేజింగ్​ డైరెక్టర్​ శిరీష ఓరుగంటి మాట్లాడారు.