- ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో స్కూళ్లను ఒంటిపూట నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నెల15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.
సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్నం12.30 గంటలకు పిల్లలకు మిడ్డే మీల్స్ పెట్టి, ఇంటికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు.
