లాడెన్‌‌‌‌ కొడుకును చంపేశాం: అమెరికా

లాడెన్‌‌‌‌ కొడుకును చంపేశాం: అమెరికా

వాషింగ్టన్‌‌‌‌: టెర్రర్‌‌‌‌ ‌‌‌‌అటాక్స్‌‌‌‌తో అగ్రరాజ్యం అమెరికానే వణికించిన అల్‌‌‌‌ఖైదా టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఒసామా బిన్‌‌‌‌లాడెన్‌‌‌‌ కొడుకు హమ్జా బిన్‌‌‌‌ లాడెన్‌‌‌‌ హతమయ్యాడు. అమెరికా ఆఫీసర్లు హమ్జాను మట్టుబెట్టారని ఆ దేశ మీడియా వార్తలను పబ్లిష్‌‌‌‌ చేసింది. లాడెన్‌‌‌‌ తర్వాత అల్‌‌‌‌ఖైదాను నడిపిస్తున్నాడనే ఆరోపణలతో అతడ్ని చంపేశారని, దానికి సంబంధించి సమాచారం తమ దగ్గర ఉందని ఎన్‌‌‌‌బీసీ న్యూస్‌‌‌‌ ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ చంపారనే విషయం చెప్పలేదు. రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఆపరేషన్‌‌‌‌లో భాగంగా హమ్జాను చంపేసినట్లు అమెరికా అధికారులు ఇద్దరు చెప్పారని న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ చెప్పింది. ఈ వార్తలపై స్పందించేందుకు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ నిరాకరించారు. “ దీనిపై నేను కామెంట్‌‌‌‌ చేయదల్చుకోలేదు” అని ట్రంప్‌‌‌‌ అన్నారు. 2017లో హమ్జాను టెర్రరిస్టుల లిస్ట్‌‌‌‌లో చేర్చారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లు వెతికారు. 2019లో అతడిపై రివార్డును ప్రకటించారు. అమెరికా టవర్స్‌‌‌‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా దాదాపు పదేళ్ల పాటు ఆపరేషన్‌‌‌‌ నిర్వహించిన అమెరికా పాక్‌లోని అబోదాబాద్‌‌‌‌లో బిన్‌‌‌‌లాడెన్‌‌‌‌ను చంపేసింది. అల్‌‌‌‌ఖైదా వారసత్వాన్ని హమ్జా లాడెన్‌‌‌‌కు అప్పగిస్తారని సూచిస్తున్న కొన్ని డాక్యుమెంట్లు లాడెన్‌‌‌‌ ఇంట్లో దొరికాయి.