గ్రేటర్ వరంగల్, వెలుగు: హనుమకొండ విద్యార్థులు రాష్ర్ట స్థాయిలో విద్యా వైజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటారు. డీఈవో గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన 8 వ తరగతికి స్టూడెంట్ ఎన్.రిత్విక్ రూపొందించిన కూలీల రహిత, పర్యావరణహిత విత్తన పరికరం, వ్యర్థాల యాజమాన్యం ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం విభాగంలో ఆత్మకూరు మండలం సెయింట్ థెరెసా పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎం.చరణ్ ప్రథమ బహుమతులు పొందారని తెలిపారు.
హరిత శక్తి విభాగంలో హనుమకొండ హంటర్ రోడ్డు పబ్లిక్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న పి.నవ్య ద్వితీయ బహుమతి గెలుపొందినట్లు వివరించారు. కార్యక్రమానికి చీఫ్గెస్టులుగా హాజరైన శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాఠశాల విద్యా కమిషనర్ అండ్ సంచాలకులు నవీన్ నికోలస్ లు విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
