సూర్యాపేట జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత : ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత : ఎస్పీ నరసింహ

సూర్యాపేట, వెలుగు: ఈ ఏడాది పోగొట్టుకున్న 842 ఫోన్‌‌ లను రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ నరసింహ అన్నారు.  జిల్లాలో మొబైల్స్‌‌  పోగొట్టుకున్న బాధితులకు 102 ఫోన్‌‌ లను సోమవారం జిల్లా పోలీస్‌‌  కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌‌ స్టేషన్‌‌ ల పరిధిలో ఉన్న సైబర్‌‌  వారియర్స్‌‌  నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 102 మొబైల్స్‌‌ ను బాధితులకు అందించగలిగామన్నారు.

 వీటిని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని తెలిపారు. విలువైన సమాచారం బ్యాంక్‌‌  అకౌంట్స్, పాస్‌‌ వర్డ్స్, సోషల్‌‌  మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు ఫోన్‌‌ లో నిక్షిప్తం చేసుకుంటున్నామన్నారు. మొబైల్‌‌ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని తెలిపారు. సెల్‌‌ ఫోన్‌‌  దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిపార్ట్‌‌  మెంట్‌‌  ఆఫ్‌‌  టెలీ -కమ్యూనికేషన్‌‌  పోర్టల్‌‌ ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. 

సూర్యాపేట, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో బాధితులకు అండగా ఉంటూ ఆయా ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని  ఎస్పీ కె. నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో  ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి కంప్లైంట్‌‌ లను పరిశీలించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారికి భరోసా కల్పించాలన్నారు.  అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 8712686057 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసు సేవలు పొందాలని అన్నారు