నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. నిర్భయపై అత్యాచారం మరియు ఆమె మృతికి కారణమైన దోషులలో ఒకడైన పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆరుగురు సభ్యుల బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పటియాలా కోర్టు వేసిన ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ దోషి పవన్ సుప్రీంలో ఈ క్యురేటీవ్ పిటీషన్‌ను దాఖలు చేశాడు.
పవన్ వేసిన పిటీషన్‌లో.. 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్ అని.. ఆ విషయాన్ని కింది కోర్టు పట్టించుకోలేదని తెలిపాడు. ఆ సమయంలో తాను మైనర్ కావడం వల్ల తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరాడు. ఇదే విషయంపై గతంలో పవన్ సుప్రీంలో రివ్యూ పిటీషన్ కూడా వేశాడు. ఆ పిటీషన్‌ను కూడా సుప్రీం కొట్టేసింది.
పిటీషన్లన్నీ కొట్టేయడంతో ముందు అనుకున్నట్లుగానే నిర్భయ దోషులకు రేపు శిక్ష అమలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలోనే వారి ఉరి శిక్షకు సబంధించి ట్రయల్ కూడా చేశారు. దాంతో రేపు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
