హంగిర్గా సొసైటీకి ఉత్తమ అవార్డు .. ఉమ్మడి నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక సోసైటీ

హంగిర్గా సొసైటీకి ఉత్తమ అవార్డు .. ఉమ్మడి నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక సోసైటీ
  • మంత్రి తుమ్మల చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్మన్, సీఈవో

భైంసా, వెలుగు: నిర్మల్ ​జిల్లా తానూర్​మండలం హంగిర్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకుంది. నాబార్డ్ 44వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2024–25లో రైతులకు అత్యధిక రుణాలు మంజూరు చేసి, రికవరీలో సైతం ముందంజలో ఉన్న 10 వ్యవసాయ సహకార సంఘాలను ఎంపిక చేసింది. ఇందులో తానూర్​లోని హంగిర్గా ప్రాథమిక సహకార సంఘం అవార్డుకు ఎంపికైంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా నుంచి అవార్డు అందుకున్న ఏకైక సోసైటీగా నిలిచింది. 

మంగళవారం హైదరాబాద్​లోని నాబార్డు ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా సంఘం చైర్మన్​ నారాయణ్​రావు పటేల్, సీఈవో బాజనొల్ల భూమయ్య అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. సొసైటీ నిర్వాహన తీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కిందని. చైర్మన్, ​సీఈవో అన్నారు. రైతుల సహకారంతోనే రాణిస్తున్నామని పేర్కొన్నారు.