కళ్లు లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొంది

కళ్లు లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొంది

కేరళ: పుట్టుకతోనే కంటి చూపును కోల్పోయింది. అందరిలా ఈ ప్రపంచాన్ని చూడలేకపోయినా... తాను ఎవరికీ తక్కువ కాదంటూ నిరూపించింది కేరళకు చెందిన హన్నా ఆలిస్ సైమన్. ఇటీవల సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో దివ్యాంగుల  కేటాగిరిలో 500కు  496 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక ఆమె ఆనందానికి అవధులు లేకుంగా పోయాయి. ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్న ఆమె... ఈ విజయానికి తన  తల్లిదండ్రులే కారణమని, అందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంది.  

స్పెషల్ స్కూల్ లో కాకుండా నార్మల్  స్కూల్లో చదివించడం వల్లే తాను ఇవాళ చదువులో రాణిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంధురాలిగా పుట్టడం వల్ల చాలామంది చాలా రకాలుగా అవమానించారని, అయితే అవే ఇవాళ తన విజయానికి కారణమయ్యాయని స్పష్టం చేసింది. ఇక మైక్రోఫ్తాల్మియా అనే వ్యాధితో కంటి చూపు కోల్పోయిన హన్నా... చదువులోనే  కాకుండా  సింగర్, మ్యూజిక్ కంపోజర్, యూట్యూబర్, మోటివేషనల్ స్పీకర్ గా బహుముఖ ప్రతిభ కనబరుస్తోంది.