హన్సికకి యాభయ్యో సినిమా

హన్సికకి యాభయ్యో సినిమా

‘దేశముదురు’ చిత్రంతో  కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక.. ఈ పదిహేనేళ్లలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. హీరోలకి జంటగా కనిపించడమే కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. వాటిలో ‘మహా’ మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇది హన్సికకి యాభయ్యో సినిమా. శింబు కీలక పాత్రలో నటించాడు. ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్. యు.ఆర్‌‌.జమీల్‌‌ దర్శకత్వంలో మదియళగన్‌‌ నిర్మించారు. శ్రీరామ్, కరుణాకరన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే హన్సిక నటించిన మై నేమ్ ఈజ్ శ్రుతి, 105 మినిట్స్ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు మరో నాలుగైదు చిత్రాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోంది హన్సిక. మరోవైపు శింబు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.