కమెడియన్​లా మారిన హన్సిక

కమెడియన్​లా మారిన హన్సిక

సౌత్​ బ్యూటీ హన్సిక(Hansika ) ఓ ఇంట్రెస్టింగ్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్​లో స్టార్​ కమెడియన్​ యోగి బాబు(Yogi Babu) తో ‘పార్ట్​నర్’ అనే సినిమాలో ఆమె నటించింది. ఇందులో యోగి బాబు నిద్రలేవగానే హన్సికలా మారిపోతాడు. ఇదే సినిమా కథ. 

ఇక ఈ రోల్ కోసం హన్సిక పెద్ద సాహసమే చేసింది. అచ్చం యోగి బాబులా బాడీలాంగ్వేజ్​ మార్చేసుకుంది.

ఇందుకోసం ఎంతో కష్టపడ్డానని తెలిపింది. ఈ సినిమాలో ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty ) మరో కీ రోల్​లో నటించాడు. ఇక తన మ్యారీడ్​ లైఫ్​ గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ.. పెళ్లి అనే  బంధంతో ఓ స్నేహితుడు తన జీవితంలోకి పార్ట్​నర్​గా వచ్చాడని తెలిపింది. ఇప్పటి వరకు 31 మంది పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నానని.. జీవితంలో ఇదో గొప్ప అనుభూతి అని ఈ సందర్భంగా వివరించింది.