Hansika Motwani: సోహైల్ తో హన్సిక విడాకులు? పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన నటి

Hansika Motwani: సోహైల్ తో హన్సిక విడాకులు?  పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిన నటి

బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో తన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి హన్సిక మోత్వానీ ( Hansika Motwani )  మరో సారి వార్తల్లో నిలిచారు. భర్త సోహైల్ ఖతురియా( Sohael Khaturiya) తో విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొంతకాలంగా తల్లివద్దే ఉంటున్న హన్సిక .. విడాకుల తీసుకోబోతున్నారంటూ వస్తున్న కథనాలపై మౌనంగా ఉన్నాయి. కానీ తాజాగా తన సోషల్ మీడియా నుంచి భర్త సోహైల్ తో ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. దీంతో ఇంతకాలం ఉన్న వస్తున్న విడాకులకు వార్తలకు ఇది అజ్యం పోసినట్లు అయింది. పెళ్లి ఫోటోలు తొలగించడంతో విడాకులు నిజమనేలా సంకేతాలు ఇచ్చింది.  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే గత కొంత కాలంగా హన్సిక , సోహైల్ విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.  గతంలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి.  దీనిపై  సోహైల్ ఓ ఇంటర్యూలో  విడాకుల పుకార్లను కొట్టిపారేశారు. కానీ హన్సికాతో విడివిడిగా ఉంటునారన్న  పుకార్లపై మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియా నుంచి తొలగించడంతో విడాకులు నిజమేనని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

 

తొలుత రింకి బజాజ్ అనే యువతిని సోహైల్ తొలుత పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకను హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్ తో హన్సిక కనెక్ట్ అయింది. 2022 డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో  వీరి  వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి వివాహం అప్పట్లో సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించింది.  సోహైల్ హన్సికకు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 ప్రస్తుతం కెరీర్ పరంగా హన్సిక నాలుగు తమిళం, హిందీ భాషల్లో నటిస్తుంది.  మరి విడాకులు నిజమేనంటూ వస్తున్న వార్తలపై హన్సిక, సోహైల్  ఎలా స్పందిస్తారో చూడాలి.