గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలి : స్నేహ శబరీశ్

గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలి : స్నేహ శబరీశ్

ధర్మసాగర్, వెలుగు:  గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించి, సీజనల్​ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్​ స్నేహ శబరీశ్​ సూచించారు. మంగళవారం కలెక్టర్​ ధర్మసాగర్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వివరాలను అడిగి తెలసుకున్నారు. 

మందుల నిల్వను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షలపై ఆరా తీశారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, వైద్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​ ధర్మసాగర్​ తహసీల్దార్​ ఆఫీస్​ను తనిఖీ చేసి, భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.