మేడారం హుండీలు మూడో రోజు రూ. 3.46 కోట్ల ఇన్​కం

మేడారం హుండీలు మూడో రోజు రూ. 3.46 కోట్ల ఇన్​కం

వరంగల్, వెలుగు: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు స్పీడ్ గా సాగుతోంది. మూడో రోజైన శనివారం మొత్తం 112 బాక్స్ లను ఓపెన్ చేయగా అత్యధికంగా రూ. 3,45,61,000 ఇన్ కం వచ్చింది. ఫస్ట్ రోజైన గురువారం రూ. రూ.3,15,40,000, శుక్రవారం రూ.2,98,35,000 ఆదాయం వచ్చింది. శనివారంతో కలిపి మూడు రోజుల్లో మొత్తం 317 హుండీలను లెక్కించడంతో ఆదాయం రూ. 9.60 కోట్లు దాటింది. మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేయగా 518 బాక్స్ లు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరుకున్నాయి.

మిగతా బాక్స్ లను తిరుగువారం కోసం మేడారంలోనే ఉంచారు. ఇప్పటివరకు లెక్కించిన ఆదాయాన్ని డిపార్ట్ మెంట్ బ్యాంక్‍ అకౌంట్ లో జమ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవ రాజేంద్రం  తెలిపారు. ఆదివారం సైతం లెక్కింపు కొనసాగించనున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు.