
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్న ఓ స్వామి వద్ద ఎక్సైజ్కానిస్టేబుల్ గ్లాసులు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమన్నందుకు కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్లు స్వాములు తెలిపారు. జరిగిన దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ఎదుట ఆందోళనకు దిగారు.
భక్తుడి పై చేయి చేసుకున్న కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్వాములకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.