Prasanth, Anupama: జై హనుమాన్ కాదు ఆక్టోపస్.. అనుపమాతో అదిరిపోయే ట్విస్ట్!

Prasanth, Anupama: జై హనుమాన్ కాదు ఆక్టోపస్.. అనుపమాతో అదిరిపోయే ట్విస్ట్!

హనుమాన్(HanuMan) సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma). ఈ సినిమాను ఆయన ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ విషయంలో విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. అతి తక్కువ బడ్జెట్ తో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ క్రియేట్ చేశారంటూ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షాత్తూ ఆ హనుమంతులవారిని దర్శించుకున్న అనుభూతిని కలిగించాడు ప్రశాంత్. దీంతో ప్రశాంత్ కు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిందని. ఆయన తరువాతి సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 

ఇక హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించాడు ప్రశాంత్. అంతేకాదు.. ఆ మధ్యే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని, త్వరలో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా జై హనుమాన్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే.. అనూహ్యంగా లైన్ లోకి ఆక్టోపస్ సినిమా వచ్చి చేరింది. అవును.. హీరోయిన్ అనుపమతో చాలాకాలం క్రితమే ఆక్టోపస్ అనే సినిమాను ప్లాన్ చేశాడట ప్రశాంత్. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఒకటి బాలన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. 

Also read :ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ..మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్!

అందుకే.. ముందు అనుపమాతో ఆక్టోపస్ సినిమాను కంప్లీట్ చేసి.. తరువాత జై హనుమాన్ ను మొదలుపెట్టాలని చూస్తున్నాడట ప్రశాంత్. దీంతో ఆక్టోపస్ ప్రాజెక్టు కాస్త.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.