రాజమౌళిపై కోపం వచ్చింది.. అందుకే ఏకలవ్యుడిగా మారిపోయాను

రాజమౌళిపై కోపం వచ్చింది.. అందుకే ఏకలవ్యుడిగా మారిపోయాను

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసిన హనుమాన్(HanuMan) సినిమా గురించే చర్చ నడుస్తోంది. మరి ఆ సినిమా సాధించిన విజయం అలాటింది. ఒక చిన్న సినిమాగా మొదలై .. టాప్ స్టార్స్ కు సైతం గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కి వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆ క్రెడిట్ అంత కేవలం దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma)కే చెందుతుంది. తీసుకున్న పాయింట్ ను ఏమాత్రం తడబడకుండా అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. అందుకే దర్శకుడు ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో హనుమాన్ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ఇండియన్ సినీ ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేసింది. దీంతో ప్రశాంత్ ఇపుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. 

ఆయన ఇంటర్వూస్ కోసం బడా ఛానెల్స్ సైతం ఎగబడుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ దర్శకధీరుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రాజమౌళి గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర అసిస్టెంట్‌ గా వర్క్ చేయాలని చాలా ప్రయత్నించాను. ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు చాలాసార్లు మెయిల్స్‌ కూడా పంపించాను. కానీ, ఆయన వాటిని రిజెక్ట్ చేశారు. టాలెంట్‌ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదు అని ఆయనపై కోపం వచ్చింది. అప్పుడే నాకు ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. అలా ఆయన సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి సినిమా గురించి చాలా నేర్చుకున్నా..  అని చెప్పుకొచ్చారు ప్రశాంత్. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అధీర అనే సూపర్ హీరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.