గాగిల్లాపూర్ లో హనుమాన్ హోమం

గాగిల్లాపూర్ లో హనుమాన్ హోమం

బెజ్జంకి, వెలుగు: మండలంలోని గాగిల్లాపూర్  హనుమాన్ టెంపుల్ లో ఆదివారం ఆలయ అర్చకుడు కాచం వెంకటేశం ఆధ్వర్యంలో హనుమాన్​హోమం నిర్వహించారు. స్వామివారికి చందన, పంచామృత, పలాభిషేకం, నవగ్రహాల పూజ, అష్టోత్తర శతనామావళి, హనుమాన్ చాలీసా పారాయణం చేసి అనంతరం పంచముఖ హనుమాన్ దీక్ష విరమణ హోమం నిర్వహించారు.

భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వాములకు కాచం వెంకటేశం భవానీ దంపతులు అన్న ప్రసాద వితరణ చేశారు. గరేపల్లి శ్రీనివాస్, అన్నాడి శ్రీనివాసరెడ్డి, ఏలేటి అనిల్ రెడ్డి, ఇతర  హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.