ఆనందమే అందం!

ఆనందమే అందం!

ఆనందంలోనే అందం  దాగుంది. ఏంటి…! నమ్మబుద్ది కావట్లేదా? కానీ ఇదే నిజం.  సంతోషంతోనూ అందం ముడిపడి ఉంటుంది. మనమెంత సంతోషంగా, ఉత్సాహంగా ఉంటే మన చర్మం అంతకు పదింతలు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం హ్యాపీ లైఫ్​తో… ఫెయిరీ లుక్​ మీ సొంతం చేసుకోండి.

ఏదైనా భయపెట్టే సంఘటన జరిగితే చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలిసిపోతే డల్​గా నిర్జీవంగా కనిపిస్తుంది.  నవ్వితే హండ్రెడ్​ ఓల్టేజ్​ బల్బ్​​​లా మెరిసిపోతుంది.  కన్నీళ్లు పెడితే  ముఖంలో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన  ప్రతి రియాక్షన్​ చర్మంపై యాక్షన్ చూపిస్తుందన్నమాట. కానీ వీటన్నింటిని పట్టించుకోకుండా చాలామంది పైపై మెరుగులతో అందంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. అయితే మనసు ఆహ్లాదంగా లేకపోతే ఎంత కాస్ట్​లీ ప్రొడక్ట్స్​ వాడినా  ప్రయోజనం ఉండదు.

కంట్రోల్

బాధ, కోపం, ఒత్తిడి, భయం లాంటివి మనసులో చేరినప్పుడు చర్మానికి హాని చేసే హార్మోన్లు విడుదలవుతాయి​. ఫలితంగా చర్మంపై డార్క్​ సర్కిల్స్​, మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలు వస్తాయి​. చర్మం సహజ లక్షణాలని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. మనసు ఇలాంటి ఎమోషన్స్​తో నిండిపోయినప్పుడు అందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఫలితం ఉండదు. అందువల్ల ఈ ఎమోషన్స్​ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత అందంగా ఉంటారు.

 నవ్వే అందం

ఎవరి ముఖంలోనైనా చూడగానే ఆకట్టుకునేది చిరునవ్వే.  ఆ నవ్వే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిపిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మెదడు ఎండార్ఫిన్​ అనే హార్మోన్​ని రిలీజ్​ చేస్తుంది. దానివల్ల డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు బరువు కూడా కంట్రోల్​లో ఉంటుంది.

నెగెటివ్ ఆలోచనలు

నెగెటివ్ ఆలోచనలు బుర్రలో చేరితో అందం ప్రమాదంలో పడినట్టే.  నెగెటివ్​ ఆలోచనల వల్ల కార్టిసాల్​ అనే హార్మోన్​ రిలీజ్ అవుతుంది. దీనివల్ల స్కిన్​ ఆయిలీ అయిపోతుంది. అంతేకాదు, ఈ ఆలోచనల వల్ల  నిద్రలేమి, కోపం, ఒత్తిడి , కొన్ని సందర్భాల్లో ఎలర్జీ లాంటి సమస్యలు చుట్టుముడతాయి​. ఫలితంగా మొటిమలు, మచ్చలు, డార్క్​ సర్కిల్స్​ వంటి సమస్యలొస్తాయి. అందువల్ల ఈ ఆలోచనలకు దూరంగా ఉండాలి.

హ్యాపీ హార్మోన్స్​

సెరటోనిన్ ​, ఆక్సిటోసిన్​, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్​​ లాంటి హ్యాపీ హార్మోన్సే మనసులోని ఆనందానికి,  ముఖంలో చిరునవ్వుకి కారణం. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా,  అందంగా మారుతుంది. సెరటోనిన్ డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా చేస్తుంది.  ఆక్సిటోసిన్ హార్మోన్ సెరటోనిన్లను ప్రేరేపించి ఆందోళనను తగ్గిస్తుంది.

ఆత్మవిశ్వాసం

ముఖానికి ఎన్ని మేకప్​ హంగులు అద్దినా కాన్ఫిడెంట్​గా లేకపోతే అంతా వ్యర్థమే. కాన్ఫిడెన్స్​ మిస్​ అయితే చర్మం  భయానికి గురై కమిలిపోతుంది. అంతేకాదు పేలవంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అదిచ్చే​ బూస్టప్​తో చర్మం మెరుస్తుంది.