Happy Akshaya Tritiya 2023 : మీ స్నేహితులకు, కుటుంబసభ్యులను విష్ చేయండిలా

Happy Akshaya Tritiya 2023 : మీ స్నేహితులకు, కుటుంబసభ్యులను విష్ చేయండిలా

ప్రపంచవ్యాప్తంగా హిందువులు, జైనులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ.  తీజ్ అని పిలిచే ఈ పర్వదినాన్ని వైశాఖ చాంద్రమాన మాసం  మూడవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ 22 న వస్తోంది. ఈ రోజున ఏదైనా మంచి పని లేదా ప్రారంభించినా విజయం, శ్రేయస్సును తెస్తుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ప్రజలు ఈ అక్షయ తృతీయను వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొందరు ఉపవాసాలను పాటిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవికి ప్రార్థనలు చేస్తారు, మరికొందరు బంగారం, ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజు బంగారం కొంటే ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు.

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ప్రజలు ఈ రోజును ధార్మిక చర్యలు చేయడం ద్వారా మరియు పేదలకు ఆహారం మరియు బట్టలు దానం చేయడం ద్వారా జరుపుకుంటారు.

ఈ రోజున ప్రజలు తమ ప్రియమైనవారికి సందేశాలను పంపి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోగల కొన్ని అక్షయ తృతీయ శుభాకాంక్షలు, సందేశాలు, కోట్‌లు ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, మీ జీవితంలో శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావాలని కోరుతూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు!
  • ఈ అక్షయ తృతీయ మీకు కొత్త ప్రారంభాలను, మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు
  • గణేశుడు, లక్ష్మీదేవిల ఆశీర్వాదం ఉండాలని, మీ జీవితంలో ఆనందం, శాంతి,  శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు
  • అక్షయ తృతీయ శుభ సందర్భంగా మీ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ అదృష్టాన్ని, విజయాన్ని తీసుకురావాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు
  • అక్షయ తృతీయ.. ఈ పవిత్రమైన రోజున, మీరు సంపద, ఆరోగ్యం, ఆనందంతో ఉండేలా ఆశీర్వదించబడాలి
  • శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండుగాక. అక్షయ తృతీయ శుభాకాంక్షలు!