టాలీవుడ్ బ్యూటీ ఫుల్ కపుల్స్లో నాగచైతన్య-శోభిత జంట వెరీ స్పెషల్. గతేడాది (2024) డిసెంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట అక్కినేని ఫ్యాన్స్కి ఎప్పుడు ప్రత్యేకమే. ఇవాళ ఈ జోడీ మరింత ప్రత్యేకం చేస్తూ.. అదిరిపోయే పోస్ట్తో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చారు.
ఇవాళ (2025 నవంబర్ 23) నాగచైతన్య తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్యకు శోభిత రొమాంటిక్గా విషెస్ చెప్పింది. “హ్యాపీ బర్త్ డే లవర్” అనే క్యాప్షన్తో ఒక అందమైన, క్లోజ్గా ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇందులో శోభిత నారింజ రంగు చీరలో, ఫాన్-రంగు ఫ్లీస్ జాకెట్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చై.. ప్రేమగా శోభితకు కామ్రేడ్గా నిల్చినట్లుగా ఫోటో అర్ధాన్ని వివరిస్తుంది.
ఈ క్రమంలో బ్యూటిఫుల్ ఫొటోతో పాటుగా శోభిత చెప్పిన విషెష్ .. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వెంటనే సినీ సెలబ్రిటీలు, అభిమానులు చైతన్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తు పోస్టులు పెడుతున్నారు. అందమైన జంట.. దిష్టి తగిలేలా ఉంది.. అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. కలకాలం ఇంతే సంతోషంతో మెలగాలని అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. తండేల్ సక్సెస్తో మంచి జోష్ మీదున్నాడు నాగచైతన్య. ఇదే సక్సెస్ను కొనసాగించేలా ఇపుడు తన నెక్స్ట్ మూవీని (NC24) రంగంలోకి దించాడు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు (Karthik Dandu) డైరెక్షన్లో చై ఓ సినిమా చేస్తున్నాడు. మైథికల్ థ్రిల్లర్గా రానున్న ఈ ప్రాజెక్ట్ కి ‘‘వృషకర్మ’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వృషకర్మ అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం. ఈ మూవీలో నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు.
#VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure !
— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025
@Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO
