శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..

శ్రీరామనవమి   శుభాకాంక్షలు ఇలా తెలపండి..

పండగ వచ్చినా.. పంబ వచ్చినా..  జనాలు స్మార్ట్​ ఫోన్​ కు పని చెబుతారు.  ఎలాంటి కార్యక్రమైనా  వాట్సప్​ ద్వారా  విషెస్​ తెలపడం సర్వ సాధారణమైంది.  బంధువులు.. స్నేహితులనుగుర్తు చేసుకుంటూ.. శ్రీరామనవమి  సందర్భంగా .... పండగ శుభాకాంక్షలు తెలపడానికి మీకోసం కొన్ని  సందేశాలు....

పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడి పుట్టిన రోజే శ్రీరామనవమి పండగ. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు ధేశంలోని వీధులన్నీ శ్రీరామ నవమి వేడుకలతో నిండిపోయి ఉంటుంది. ఈ సారి అయోధ్యలో కూడా మునుపెన్నడూ లేనివిధంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు శ్రీరరాముడి జన్మదినమే కాదు, అదే రోజు ఆయన పట్టాభిషేకం, కళ్యాణం కూడా అదే రోజు చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. ఆ రోజు ఎక్కడ చూసినా పానకం వడపప్పులు పంచుతారు. 

  •  శ్రీ రాఘవం దేశ దశాత్మజ ప్రమేయం..... సీతాపతిం రఘు కలాస్వయ.... రత్నదీపమ్ రజామబాహుమరవింద..... దళత్పక్షమ రామం విశాల్ ....వినాశికరం నమామి...... శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
  •  రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్.. ...నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి....... శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. 
  • శుద్ధబ్రహ్మ పరాత్పర రామా .....కాలాత్మక పరమేశ్వర రామా ....శేషతల్ప సుఖనిద్రత రామా...... బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా.... శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 
  •  శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!' - అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు 
  • సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.... శ్రీ సీతారాముల అనుగ్రమంతో మీకు సర్వదోషములు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
  •  పట్టాభిరామునికి ప్రియవందనం ....పాప విదూరునికి జయవందనం.... అయోధ్య రామునికి అభివందనం... అందాల దేవునికి మదే మందిరం... శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. - శ్రీరామ నవమి శుభాకాంక్షలు 
  •  ఈ శ్రీరామ నవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను.. ...ఆరోగ్యాన్ని అందించాలని.. ...శ్రీరామ చంద్ర మూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. - అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 
  • ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ.... ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం... ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత ....ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.... ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం.... ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం. ....ఒక మనిషిలోని బలం..... మరో మనిషిలోని స్వార్థం..... ఇంకో మనిషిలో కామం.... ఒకరి ఎదురుచూపులు...... మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు.. అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.. అదే రామాయణం'. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 
  • శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం.. శ్రీరామనవమి.. మీకు శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తున్నాను.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. 
  •  శ్రీరామనామము... త్రిమూర్తులు పూజించిన ఫలం... శ్రీరామ చరిత్ర జగమంతా ధర్మస్థాపన ఫలితం .....మహర్షి వాల్మీకి రచించిన మహా కావ్యం రామాయణం ....అనంత విశ్వంలో మధుర పదం శ్రీరామ నామం ...శ్రీరామ నవమి శుభాకాంక్షలు