మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: మంత్రి వివేక్

మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: మంత్రి వివేక్

హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బోనాల పండగ సందర్భంగా శనివారం (జూలై 19) దూల్‎పేట్‎లోని మహంకాళి అమ్మవారిని మంత్రి వివేక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‎కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వివేక్. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్ర గల మహంకాళి అమ్మవారి టెంపుల్‎ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. టెంపుల్‎ను మైయింటైన్ చేస్తోన్న కమిటీ సభ్యులకి, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు మంత్రి వివేక్.  రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు పడాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నానని తెలిపారు.