IPL 2024: దేవుడా.. ఓ మంచి దేవుడా.. గెలుపు కోసం పాండ్యా ప్రత్యేక పూజలు

 IPL 2024: దేవుడా.. ఓ మంచి దేవుడా.. గెలుపు కోసం పాండ్యా ప్రత్యేక పూజలు

ఐపీఎల్‌ చరిత్రలో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ముంబై ఇండియ‌న్స్.. ప్రస్తుత సీజన్‌లో ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలయ్యింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవుడా... ఓ మంచి దేవుడా

ముంబై ఇండియ‌న్స్ తదుపరి మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే వేదికగా ఏప్రిల్ 7న జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పాండ్యా దేవుని చెంతకు చేరారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. జట్టు విజయం బాట పట్టేలా, ఆటగాళ్లందరూ ఏకతాటిపైకి వచ్చేలా చూడాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్టార్ ఆల్ రౌండర్ విగ్రహం ముందు పూజలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.