టీ20 ప్రపంచకప్‌ కోసం రెడీ అవుతున్నా

టీ20 ప్రపంచకప్‌ కోసం రెడీ అవుతున్నా

ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో సన్నద్ధం అవుతానని టీమిండియా ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటున్నాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకున్నప్పటికీ ఈ పించ్‌ హిట్టర్ బౌలింగ్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మునుపటిలా ఎప్పుడు బౌలింగ్ చేస్తావనే ప్రశ్నకు సమాధానంగా పాండ్యా పైవిధంగా జవాబిచ్చాడు. 

‘ఐపీఎల్‌ టైమ్లో‌ బౌలింగ్ చేయడం ఆరంభించా. నా ద‌ృష్టి మొత్తం వచ్చే వరల్డ్ కప్‌‌ మీదే ఉంది. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే అన్ని మ్యాచుల్లోనూ బౌలింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం చాలా శ్రమిస్తున్నా. బౌలింగ్ దళంలో ఉండాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. సర్జరీ తర్వాత కూడా నా పేస్ తగ్గలేదు. బౌలింగ్‌లో నియంత్రణ కూడా కోల్పోలేదు. నా బౌలింగ్ పూర్తిగా నా ఫిట్‌నెస్‌కు సంబంధించింది. నేనెంత ఫిట్‌గా మారితే బౌలింగ్ అంత బాగా వేయగలను. ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌‌గా గాయాలపాలవ్వడం మామూలే. దీనికి నేను సిద్ధంగా ఉన్నా’ అని హార్దిక్ చెప్పాడు.