తొలి టీ20లో భారత్‌ విజయం

తొలి టీ20లో భారత్‌ విజయం

సౌతాంప్టన్‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్‌ఇండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది.  ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా (33 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 51) హాఫ్‌‌‌‌ సెంచరీతో దంచికొట్టడంతో 20 ఓవర్లలో 198/8 స్కోరు చేసింది. టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ (24) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. కానీ మూడో ఓవర్‌‌‌‌లోనే వెనుదిరగడంతో తొలి వికెట్‌‌‌‌కు 29 రన్స్‌‌‌‌ సమకూరాయి.

రెండో ఎండ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (8) కూడా నిరాశపర్చాడు. ఈ దశలో దీపక్‌‌‌‌ హుడా (33), సూర్యకుమార్‌‌‌‌ (39).. ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టారు. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీల వర్షం కురిపించి మూడో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ జోడించారు. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన హార్దిక్‌‌‌‌కు.. సూర్య మంచి సమన్వయం అందించాడు. ఈ ఇద్దరి దెబ్బకు10 ఓవర్లలోనే ఇండియా స్కోరు 100కు చేరింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న దశలో 12వ ఓవర్‌‌‌‌లో జోర్డాన్‌‌‌‌ వేసిన బౌన్సర్‌‌‌‌కు సూర్య వెనుదిరిగాడు. ఫలితంగా 37 రన్స్‌‌‌‌ వచ్చాయి. సహచరులు వెనుదిరిగినా.. పాండ్యా తన మార్క్‌‌‌‌ ఆటతో అలరించాడు. అక్షర్‌‌‌‌ (17), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (11), హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (3) నిరాశపర్చారు. మొయిన్‌‌‌‌ అలీ, జోర్డాన్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. మోయిన్‌ అలీ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్‌ (28) పోరాడినా ఫలితం లేకపోయింది. చాహల్‌, అర్శ్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో టీ20 జరుగనుంది.