హార్దిక్ జోరు.. ఆసీస్ మూడు వికెట్లు డౌన్

హార్దిక్ జోరు.. ఆసీస్ మూడు వికెట్లు డౌన్

చెన్నై వేదికపై జరుగుతోన్న భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డేలో టీమిండియా జోరు పెంచింది. దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను హార్దిక్ పాండ్యా వెంట వెంటనే ఔట్ చేసి భారత్ ను మళ్లీ గేమ్ లోకి తీసుకొచ్చాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33, 31 బంతుల్లో), మిచెల్ మార్ష్ (47, 47 బంతుల్లో) మొదటి ఓవర్ నుంచే దాటిగా ఆడారు. పేస్, స్పిన్ అని తేడా లేకుండా బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలు రాబట్టారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 68 పరుగులు చేసింది.

తర్వాత బంతి అందుకున్న హార్దిక్.. మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టాడు. తర్వాత ఓవర్లలో స్మిత్ (0), మిచెల్ మార్ష్ ను ఔట్ చేశాడు. కవర్స్ లో భారీ షాట్ ఆడబోయిన స్మిత్ కీపర్ కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అప్పటినుంచి టీమిండియా జోరు పెంచింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కో్రు 111/3, 21 ఓవర్లలో వద్ద కొనసాగుతోంది.