Hari Hara Veera Mallu: వీరమల్లు హాటెస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వాల్యూమ్ పెంచుకోండి!

Hari Hara Veera Mallu: వీరమల్లు హాటెస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వాల్యూమ్ పెంచుకోండి!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. 

లేటెస్ట్గా ‘తారా తారా-ది సిజ్లింగ్ సింగిల్’అనే లిరికల్ ట్రాక్ అప్డేట్ ఇచ్చారు. ఆస్కార్ గ్రహీత కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని మే 28న రిలీజ్ చేయనున్నాం అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

"హరిహరవీరమల్లు నుండి ఈ సంవత్సరం అత్యంత హాటెస్ట్ ట్రాక్‌ని వినడానికి సిద్ధంగా ఉండండి. పూర్తి పాట మే 28న ఉదయం 10:20 గంటలకు విడుదల అవుతుంది! వాల్యూమ్ పెంచడానికి రెడీ అవ్వండి" అంటూ క్రేజీ క్యాప్షన్తో క్యూరియాసిటీ పెంచారు. 

ఇటీవలే హరిహర వీరమల్లు’నుంచి మూడో పాట రిలీజై గూస్ బంప్స్ తెప్పించింది. ‘అసుర హననం’(Asura Hananam) పేరుతో వచ్చిన ఈ పాట రౌద్ర‌ర‌సాన్ని వేరమల్లు ఆవిష్క‌రించేలా ఉండటంతో ఆడియన్స్ ప్లే లిస్టులో మార్మోగుతుంది.

ఇప్పటికే హరిహర వీరమల్లు నుంచి రిలీజైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో సాంగ్స్ సైతం ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఇప్పుడు రానున్న 'తారా తారా' సాంగ్ పవర్ స్టార్ అభిమానుల్లో దాగున్న వేడిని బయటకే తీసుకొచ్చే విధంగా ఉండనుంది.