నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు

 నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల కస్టడీ సమయం ఈ రోజుతో ముగియనుంది. ఈ కేసులో నవీన్  కన్ఫెన్షన్ స్టేట్ మెంట్ రికార్డును అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.  వారం రోజుల పాటు  హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని  విచారించగా.. ఇందులో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. నిహారికను నవీన్ ఇబ్బంది పెడుతుండంటంతోనే అతడిని చంపాలని ప్లాన్ చేయాలని అనుకున్నట్లుగా హరిహరకృష్ణ పోలీసులకు ముందు ఒప్పుకున్నాడు. అందుకోసం  రెండు నెలల క్రితమే డీమార్ట్ లో కత్తి, మెడికల్ షాప్ లో ప్లాస్టిక్ గ్లౌజ్ కొన్నానని చెప్పాడు. 

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 16వ తేదీన నవీన్ ని మర్డర్ చేయాలని అనుకున్నానని కానీ కుదరకపోవడంతో 17న హైదరాబాద్ కు  పిలిపించి హత్య చేసినట్టుగా హరిహరకృష్ణ తెలిపాడు. పెద్ద అంబర్పేట్లో లిక్కర్ తాగి నవీన్ ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునొక్కి చంపేసి ఆ తర్వాత కత్తితో తలా మొండెం వేరు చేశానని వెల్లడించాడు. ఆ తరువాత హసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అతనికి జరిగదంతా చెప్పానని తెలిపాడు. ఆ మరుసటిరోజు మర్డర్ గురించి నిహారికకు చెప్పానని హరిహరకృష్ణ చెప్పాడు. భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్ తిరిగానని 24న పోలీసులు ముందు లొంగిపోయినట్టుగా వెల్లడించాడు. కాగా ఈ కేసులో  A 1 నిందితుడిగా హరిహర కృష్ణ, A 2 నిందితుడిగా హసన్. A3 నిందితుడిగా నిహరిక పేర్లను చేర్చారు.