
ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’లో పోలీసాఫీసర్‌గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ మూవీలో బందిపోటుగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. పవన్ ఫస్ట్ టైమ్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. క్రిష్ రూపొందిస్తున్న ఈ మూవీకోసం భారీ సెట్స్ వేస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ముఘులుల కాలం నాటి కథ కావడందో సెట్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్టు చెప్పిన ఆయన ఫిబ్రవరి, లేదా మార్చి నెలలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. రీసెంట్‌గా ఆయనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వీరమల్లు కథ అద్భుతమైనది. అలాంటి స్టోరీకి తగ్గట్టు సెట్స్ వేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటికే కొన్ని సెట్లు పూర్తి చేశాం. మరికొన్ని రెడీ చేస్తున్నాం. నేచురల్ ఫీల్ కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సినిమాకి సెట్స్ కూడా హైలైట్ అవుతాయనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్‌కి క్లోజ్ ఫ్రెండ్. ‘తొలిప్రేమ’తో సహా పవన్ నటించిన పలు సినిమాలకి ఆనంద్ భారీ సెట్స్‌తో స్పెషల్ అట్రాక్షన్ తెచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.ఎం.రత్నం ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.