సిద్దిపేటలో దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి : హరీశ్ రావు

సిద్దిపేటలో దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి :  హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : దివ్యాంగులకు కాంగ్రెస్​ సర్కారు ఇస్తానన్న రూ.6 వేల పెన్షన్​ను వెంటనే ఇవ్వాలని వారి పక్షాన కోరుతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత లయన్స్, అలయన్స్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు అభయ జ్యోతి ద్వారా అందించే ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.400, రూ.700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదని, రూ.4వేల పెన్షన్ ఇచ్చిన ఏకైక లీడర్​కేసీఆర్​ మాత్రమే అని అన్నారు. మానసిక వికలాంగులకు అవసరాల కోసం తన జీతం నుంచి కొంత డబ్బులు ఇస్తానని ప్రకటించారు.