
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ప్రభత్వం మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 7 నెలల తర్వాత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తున్నారని చెప్పారు.ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై వరకు వడ్డీని తామే భరిస్తామనీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరి రైతుల రుణమాఫీకి సంబంధించిన ఫోటోలను హరీశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీళ్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024
ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO