టీఆర్ఎస్ గెలుపు పై మంత్రి హరీష్ ట్వీట్

టీఆర్ఎస్ గెలుపు పై మంత్రి హరీష్ ట్వీట్

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. "చైతన్యానికి మారుపేరైన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరిగిన ధర్మ యుద్ధంలో, సీఎం కేసీఆర్ వెంట నిలిచి, అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా అహర్నిశలు శ్రమించిన తీరుకు అభినందనలు. బీజేపీ కుట్రలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటంలో మాకు  ఆద్యంతం శక్తిని, స్ఫూర్తిని నింపిన మా నాయకుడు కేసీఆర్ కి ధన్యవాదాలు" అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఓవరాల్ ఆధిక్యంతో ఎక్కడా వెనకబడకుండా టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి డిపాజిట్ గల్లంతైంది.