Akhanda 2 : అఖండ 2లో.. బజరంగీ భాయిజాన్‌‌‌‌‌‌‌‌ మున్ని .. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

Akhanda 2 : అఖండ 2లో.. బజరంగీ భాయిజాన్‌‌‌‌‌‌‌‌ మున్ని .. పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

పదేళ్ల క్రితం వచ్చిన సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్‌‌‌‌‌‌‌‌’లో మున్ని అనే ఆరేళ్ల చిన్నారి పాత్రతో ఆకట్టుకున్న హర్షాలీ మల్హోత్ర... ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రంలో ఆమె నటిస్తోంది. బుధవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో ట్రెడిషనల్ కాస్టూమ్స్‌‌‌‌‌‌‌‌లో చిరునవ్వులు  చిందిస్తూ  ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌తోనే ఆకట్టుకునేలా ఉంది హర్షాలీ.  ముంబైకి చెందిన ఆమె.. బాలనటిగా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి పలు సీరియల్స్‌‌‌‌‌‌‌‌లో నటించింది.  

సల్మాన్ సినిమా ఆమెకు చక్కని గుర్తింపుతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టింది.  ఇక ‘అఖండ 2’లో ‘జనని’ అనే కీలక పాత్రలో ఆమె కనిపించబోతోందని మేకర్స్ తెలియజేశారు.  బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కనిపించనుండగా ఆది పినిశెట్టి విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు.  ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.